ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. నారాయణపేట జిల్లా కేంద్రం సమీపంలోని సింగారం చౌరస్తాలో రోడ్డు దాటే సమయంలో మహిళను బస్సు ఢీకొట్టింది. కర్నూలు నుంచి నారాయణపేటకు వస్తున్న ఆర్టీసీ బస్సు ఆమె రోడ్డు దాటుతుండగా మలుపు తీసుకుంటూ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ బస్సు కింద పడి మృతి చెందింది.

షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, కారును తప్పించబోయి బస్సును ఢీకొట్టిన లారీ, 17 మందికి తీవ్ర గాయాలు

ఇక మరో ఘటనలో ఆర్టీసీ బస్సు(RTC bus) ఢీకొట్టి మహిళ మృతి చెందిన విషాదకర సంఘటన జగిత్యాల(Jagtial )జిల్లా కేంద్రంలోని కరీంనగర్ వెళ్లే రోడ్డు వద్ద చోటు చేసుకుంది. జగిత్యాలలోని బుడిగజం గాల కాలనీకి చెందిన తూర్పాక తిరుపతమ్మ (40) అనే మహిళ రోడ్డు దాటుతుండగా నిజామాబాద్-1 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన తిరుపతమ్మను స్థానికులు జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్‌లో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Woman dies in road accident after being hit by RTC bus

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)