ఏపీ సీఎం జగన్ ని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రశంసలతో ముంచెత్తారు. ఏపీ కష్టాల్లో కూరుకుపోయినపుడు జగన్‌ ముందుండి నడిపించిన తీరును ఆయన కొనియాడారు. రీ డిజైన్‌ చేసిన హిందూ ఇంగ్లీష్‌ పేపర్‌ను బుధవారం కేటీఆర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హిందూ ఎడిటోరియల్‌ టీమ్‌తో మాట్లాడిన కేటీఆర్‌.. సంక్షేమ పథకాలపై ఫోకస్‌ పెట్టిన వైఎస్‌ జగన్‌ అభివృద్ధిని పట్టించుకోకుండా పాలన సాగిస్తున్నారని కొంత మంది చేస్తున్న ఆరోపణలను ఖండించారు. కరోనా వైరస్‌ ఉధృతిలోనూ ఏపీ ఆర్థిక పరిస్థితిని జగన్‌ చక్కదిద్దారని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)