Newdelhi, Mar 16: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) వైద్యులు పరీక్షలు నిర్వహించారు. శనివారం ఉదయం ఈడీ (ED) కేంద్ర కార్యాలయం పరివర్తన్ భవన్‌కు వెళ్లిన మహిళా డాక్టర్ల బృందం.. ఆమెకు వైద్య పరీక్షలు చేశారు. ఈడీ కార్యాలయంలో కవితను ప్రత్యేక సెల్ లో ఉంచారు. అక్కడే వైద్య బృందం ఆమెకు పరీక్షలు నిర్వహించింది. ఉదయం 10.30 గంటలకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ న్యాయస్థానంలో కవితను ప్రవేశపెట్టనున్నారు. న్యాయస్థానం కవితను ఈడీ కస్టడీకి ఇస్తుందా.. లేదా అన్నది చూడాలి. ఒకవేళ ఈడీ కస్టడీకి ఇవ్వకపోతే 14 రోజుల రిమాండ్ విధించే అవకాశం ఉన్నది. కవిత న్యాయవాదుల బృందం బెయిల్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది.
కవితకు వైద్య పరీక్షలు | Delhi Liquor Policy Scam - TV9#mlckavithaarrest #delhiliquorpolicyscam #tv9telugu pic.twitter.com/Wes4Rsg34M
— TV9 Telugu (@TV9Telugu) March 16, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)