తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య మరింత పెరిగింది. రాష్ట్రంలో మరో 12 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు (Omicron in TS) నమోదయ్యాయి. వారిలో నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చినవారు 10 మంది ఉన్నారు. వారిని కలిసిన వారిలో మరో ఇద్దరికి కూడా ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. తాజా కేసులతో కలిపి తెలంగాణ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 55కి పెరిగింది. వారిలో 10 మంది కోలుకున్నారు.
అటు, తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 37,839 శాంపిల్స్ పరీక్షించగా, 182 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 90 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 17, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 11 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 181 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,80,844 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,73,404 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,417 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,023కి పెరిగింది.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.27.12.2021 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/hTNtXwCjGF
— IPRDepartment (@IPRTelangana) December 27, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)