తెలంగాణ రాష్ట్రంలో గత రెండు వారాలుగా కేసుల్లో పెరుగుదల కనిపించగా, మంగళవారం మాత్రం ఏకంగా 400 మార్కును దాటాయి. ఒక్కరోజులో 26,704 మందికి కరోనా పరీక్షలు చేయగా, 403 మంది వైరస్‌ బారిన పడ్డట్టు తేలింది. అందులో హైదరాబాద్‌లో 240, రంగారెడ్డి జిల్లాలో 103 మంది ఉన్నారు. మూడున్నర నెలల తర్వాత ఇంతటిస్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. సీజనల్‌ వ్యాధులు కూడా పెరుగుతుండటంతో జాగ్రత్తలు పాటించాలని, మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్‌ వాడటం తప్పనిసరి అని శ్రీనివాసరావు పేర్కొన్నారు.

రెండు డోస్‌ల టీకా వెంటనే తీసుకోవాలని, పదేళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్లు దాటినవారు అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని సూచించారు. కోవిడ్‌ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న 20– 50 ఏళ్ల మధ్య వయసువారు బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి, కేన్సర్, ఇతర దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్నవారు కోవిడ్‌కు గురికాకుండా చూసుకోవాలని, వైద్యం కోసం తప్ప ఎలాంటి ప్రయాణాలు చేయొద్దని పేర్కొన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)