తెలంగాణ రాష్ట్రంలో గత రెండు వారాలుగా కేసుల్లో పెరుగుదల కనిపించగా, మంగళవారం మాత్రం ఏకంగా 400 మార్కును దాటాయి. ఒక్కరోజులో 26,704 మందికి కరోనా పరీక్షలు చేయగా, 403 మంది వైరస్‌ బారిన పడ్డట్టు తేలింది. అందులో హైదరాబాద్‌లో 240, రంగారెడ్డి జిల్లాలో 103 మంది ఉన్నారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు ఏకంగా 1.5 శాతం నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

మూడున్నర నెలల తర్వాత ఇంతటిస్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన కరోనా బులెటిన్‌ విడుదల చేశారు. కాగా, ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 7.96 లక్షలకు చేరింది. ఒక్కరోజులో 145 మంది కోలుకోగా, ఇప్పటివరకు 7.90 లక్షల మంది కోలుకున్నారు. 2,375 క్రియాశీలక కేసులు ఉన్నాయి. 24 మంది ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చేరారు. అందులో 12 మంది సాధారణ పడకలపై, ఏడుగురు ఆక్సిజన్‌పై, ఐదుగురు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)