హైదరాబాద్‌ - విజయవాడ 65వ జాతీయ రహదారిపై సూర్యాపేట హైటెక్‌ బస్‌స్టాండ్‌ సమీపంలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఆటో ఢీ కొట్టింది. ఈ ఘటనలో.. సూర్యాపేట పట్టణానికి చెందిన పుట్టా సరిత (41) (ఉపాధ్యాయురాలు) అక్కడిక్కడే మృతి చెందింది. సూర్యాపేట మండలం లక్ష్మీతండాకు చెందిన రుణావత్‌ రుక్కమ్మ(63), రెండేళ్ల చిన్నారి సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.గాయపడిన వారిలో మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాద సమయంలో ఆటోలో 14 మంది ప్రయాణికులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)