గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. మంగళవారం వేకువజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.పంజాగుట్టలో ఓ అపార్ట్ మెంట్ పై పిడుగుపడింది. సిటీ రోడ్లు నదులను తలపిస్తున్నాయి.మరో మూడు గంటల్లో భారీ వర్షం ముంచెత్తనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు. పంజాగుట్టలోని సుఖ్ నివాస్ అపార్టుమెంటు వద్ద కారు షెడ్డుపై పిడుగుపడడంతో లోపల పార్క్ చేసిన కారు ధ్వంసమైంది. విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దక్షిణ బంగ్లాదేశ్‌లో అల్పపీడనం, దేశ వ్యాప్తంగా ఆగస్టు 24 వరకు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, రెయిన్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
Here's Video
హైదరాబాద్: కుండపోత వర్షానికి పంజాగుట్ట కాలనీలోని సుక్ నివాస్ అపార్ట్‌మెంట్ రెయిలింగ్‌పై పడిన పిడుగు.. రెయిలింగ్, కారు షెడ్డు, కారు ధ్వంసం.. తెగిపడిన విద్యుత్ తీగలు.#HyderabadRains #HeavyRains #ThunderStorm #Panjagutta #NewsUpdates #Bigtv pic.twitter.com/k831Emh1Dx
— BIG TV Breaking News (@bigtvtelugu) August 20, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)