హైదరాబాద్‌లోని చంపాపేట ప్రధాన రహదారిపై వేగంగా వచ్చిన ఇన్నోవా వాహనం రోడ్డు పక్క ఉన్న విద్యుత్ స్థంబానికి ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు సూఫీయాన్. మహమూద్ అద్నాన్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు యాసిన్, మహావేర్, మవ్యలు తీవ్ర గాయపడ్డారు. సమాచారం అందుకున్న సరూర్ నగర్ పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి, మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వారంతా చాంద్రాయణగుట్ట రాజ్ నగర్ కాలనీ వాసులుగా పోలీసులు గుర్తించారు. వీడియో ఇదిగో, చిన్న గొడవకే డ్రైవర్‌ని బస్సుతో తొక్కించి చంపిన మరో డ్రైవర్, సీసీ కెమెరాలో రికార్డ్ అయిన యాక్సిడెంట్ వీడియో
Here's Video
అతివేగానికి ఇద్దరు బలి
చంపాపేట్ దగ్గర అతివేగంతో కరెంట్ స్తంభాన్ని ఢీకొన్న ఇన్నోవా వాహనం.. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి, మరో ముగ్గురికి గాయాలు pic.twitter.com/UMm7j437Ao
— Telugu Scribe (@TeluguScribe) July 25, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)