తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళసై సౌందరరాజన్‌ రాష్ట్రాన్ని విడిచి వెళుతూ భావోద్వేగానికి గురయ్యారు. నేను తెలంగాణ ప్రజలను విడిచిపెట్టడం చాలా బాదగా ఉంది. నాకు సపోర్టుగా నిలిచిన అందరికి ధన్యవాదాలు. మీరంతా నా సోదరులు, సోదరీమణులు, నేను మీ అందరితో టచ్ లో ఉంటాను, "నేను ఎప్పటికీ మీ సోదరినే అంటూ తమిళసై సౌందరరాజన్‌ మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై సౌందరరాజన్‌ రాజీనామా చేయగా దానిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. దీంతో తెలంగాణకు కొత్త గవర్నర్‌ నియామకం జరగాల్సి ఉన్న నేపథ్యంలో.. జార్ఖండ్‌ గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌కు తెలంగాణ బాధ్యతలను అదనంగా అప్పజెప్పారు.తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గానూ ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణకు పూర్తిస్థాయి గవర్నర్‌ నియామకం జరిగేదాకా సీపీ రాధాకృష్ణన్‌ గవర్నర్‌గా కొనసాగనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో తెలిపారు.  తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌, పూర్తిస్థాయి గవర్నర్‌ నియామకం జరిగేదాకా బాధ్యతలు చేపట్టనున్న బీజేపీ మాజీ చీఫ్‌

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)