తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమి తర్వాత తొలిసారి స్పందించారు. సోమవారం సాయంత్రం ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌజ్‌లో గెలిచిన ఎమ్మెల్యేతో ఆయన భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గెలిచిన ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు. వచ్చే నెల 16వ తేదీ దాకా మన ప్రభుత్వం కొనసాగేందుకు అవకాశం ఉంది(తెలంగాణ అసెంబ్లీ కాలపరిమితి గడువు జనవరి 16వ తేదీ దాకా ఉంది). కానీ, ప్రజల తీర్పుతో హుందాగా తప్పుకున్నాం. కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం.. ఏం జరగుతుందో చూద్దాం’’ అని అన్నట్లు తెలుస్తోంది.

అలాగే.. త్వరలో తెలంగాణ భవన్‌లో పార్టీ మీటింగ్‌ జరుపుదాం. ఎన్నికల ఫలితాలపై సమీక్ష చేద్దాం. అదే మీటింగ్‌లో బీఆర్‌ఎస్‌ శాసనసభ పక్ష నేతను ఎన్నుకుందాం అని ఆయన ఎమ్మెల్యేలతో అన్నారు. సీఎం కేసీఆర్‌ను కలిసిన వాళ్లలో నెగ్గిన ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, పలువురు సీనియర్లు ఉన్నారు.ముందుగా తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో ఎమ్మెల్యేలు భేటీ అయి అనంతరం అక్కడి నుంచి ఎమ్మెల్యే ఎర్రవెల్లిలోని కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌కు చేరుకున్నారు

Here's KCR Meeting with MLAS Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)