ఉక్రెయిన్‌లో చదువుతున్న తమ రాష్ట్ర విద్యార్థులను క్షేమంగా ఇండియాకు తీసుకురావాలని కేంద్ర విదేశాంగ మంత్రికి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. వారి తరలింపుకు అయ్యే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. కాగా తెలంగాణ నుంచి సుమారు ఆరు వందల మంది విద్యార్థులు ఉక్రెయిన్‌లో మెడిసిన్‌ చేస్తున్నట్టు సమాచారం. వీరిలో సగానికి పైగా విద్యార్థులు అక్కడే చిక్కుకుపోయారు. వీరి కోసం హైదరాబాద్‌తో పాటు న్యూఢిల్లిలోని తెలంగాణ భవన్‌లో హెల్ప్‌లైన్‌లు ఏర్పాటు చేశారు. తమను రక్షించాలని.. త్వరగా ఇండియాకి వచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ అనేక కాల్స్‌ హెల్ప్‌లైన్‌ నంబర్లకు వస్తున్నాయి. దీంతో తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)