తెలంగానలోని ములుగు జిల్లా జాకారం గ్రామ సమీపంలోని రాజరాజేశ్వరి కాటన్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున పత్తి దగ్ధమైంది. ప్రమాదం జరిగిన సమయంలో గోడౌన్‌లో లక్షలాది రూపాయల విలువ చేసే పత్తి ఉంది. అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రాథమిక సమాచారం మేరకు మిషన్ల రాపిడి వల్ల మంటలు అంటుకొని... ప్రమాదం జరిగినట్లుగా చెబుతున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసి.. దర్యాఫ్తు చేస్తున్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)