తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.అయితే అధిష్ఠానం దాదాపు రేవంత్ రెడ్డి పేరును దాదాపు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా తెలంగాణ సీఎం పదవి రేసులో తాను కూడా ఉన్నట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పునరుద్ఘాటించారు. పార్టీ హై కమాండ్‌ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పారు.సీఎం పదవిని ముగ్గురు.. నలుగురు ఆశించడంలో తప్పు ఏంటని ప్రశ్నించారు. సీఎం ఎంపిక విషయంలో పార్టీ హైకమాండ్‌ సరైన పద్ధతి పాటిస్తోందని చెప్పారు.

‘‘ఫలితాలు వచ్చి 48 గంటలు కూడా కాలేదు. సీఎం అభ్యర్థి ఖరారు ఆలస్యం అనడం సరికాదు. ఇవాళ ఉదయం డీకే శివకుమార్‌ను ఢిల్లీలో కలిశా. ఆయనకు నా అభిప్రాయం తెలియజేశాను. నేను కాంగ్రెస్‌ నుంచే 7 సార్లు వరుసగా గెలిచా. అలాంటప్పుడు సీఎం పదవిని ఆశించడంలో తప్పేముంది?ఈ విషయంలో కాంగ్రెస్‌ పార్టీలో ఎలాంటి గందరగోళం లేదు’’ అని ఉత్తమ్‌ తెలిపారు. సీఎం అయ్యేందుకు నాకు అన్ని అర్హతలు ఉన్నాయని, మొదటి నుంచి తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు

Here's News Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)