వరుసగా మూడో రోజు కూడా విపక్ష సభ్యుల ఆందోళనలతో అట్టుడికింది. టీఆర్ఎస్ ఎంపీలతోపాటు ఇతర పార్టీల ఎంపీలు కూడా ధాన్యం సేకరణ, పంటలకు కనీస మద్దతు ధర, ఆందోళనల్లో మరణించిన రైతులకు పరిహారం విషయమై సభలో నినాదాలు చేశారు. టీఆర్ఎస్ ఎంపీలు ఛైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టారు. ధాన్యం సేకరణపై కేంద్రం సమగ్ర విధానం తీసుకురావాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం ఖరీఫ్ వరిని సేకరించాలని & రబీ కోసం వరిపై ఎటువంటి ఆంక్షలు వద్దని లోక్‌సభలో డిమాండ్ చేసారు. ఖరీఫ్ పంటను కేసీఆర్ కొనుగోలు చేయాలని టీఆర్‌ఎస్ ఎంపీలకు హితవు పలికారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం గోనె సంచులు కొనుగోలు చేయలేదు& రవాణా కాంట్రాక్టులు కూడా ఇవ్వలేదని తెలిపారు.
In the parliament, I demanded that the central govt procures Kharif paddy & that no restrictions be put on paddy sowing for rabi crop. Asked the protesting TRS MPs to first ask KCR to buy Kharif crop. Telangana Govt has not even purchased gunny bags or given transport contracts! pic.twitter.com/4aBseEhicn
— Uttam Kumar Reddy (@UttamINC) December 1, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)