తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం కేసీఆర్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సీఎం కేసీఆర్‌కు ఫోన్‌లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి హార్దిక జన్మ దిన శుభాకాంక్షలు అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.
మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని, మీ లక్ష్యసాధనకి, ప్రజాసేవకి మీకు ఆ భగవంతుడు అపరిమిత శక్తి సామర్ధ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను అంటూ ట్విటర్‌లో మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్‌కి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నాను అంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు.
Birthday wishes to Telangana CM Shri KCR Garu. Praying for his long and healthy life. @TelanganaCMO
— Narendra Modi (@narendramodi) February 17, 2022
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారు,
మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను.@TelanganaCMO pic.twitter.com/MXUlXKi0Fj
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) February 17, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)