సీఎం కేసీఆర్( CM KCR ) సమక్షంలో ఎన్సీపీ నేత అభయ్ కైలాస్ రావ్ చిక్టగోంకర్( Abhay Kailasrao Chikatgaonkar ) చేరారు. ప్రగతి భవన్( Pragathi Bhavan )లో అభయ్ కైలాస్‌కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు సీఎం కేసీఆర్. ఔరంగాబాద్‌కు చెందిన అభయ్ కైలాస్‌ది రాజకీయ కుటుంబం. అభయ్ కైలాస్ తండ్రి, తాత గతంలో ఎమ్మెల్యేలుగా పని చేశారు. ఆయన మామ మాజీ ఎమ్మెల్యే కాగా, అత్త మాజీ జడ్పీ ప్రెసిడెంట్. 1998లో ఎన్ఎస్‌యూఐ ఔరంగాబాద్ విభాగానికి అభయ్ అధ్యక్షుడిగా పని చేశారు. 2002-07 వరకు ఔరంగాబాద్ జడ్పీ ప్రెసిడెంట్‌గా సేవలందించారు.
Here's Update News
మహారాష్ట్ర లో ఊపందుకున్న చేరికలు
కాంధార్ లోహ బహిరంగ సభ సక్సెస్ తో బీఆర్ఎస్ లోకి ఊపందుకున్న చేరికలు
సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరిన ఎన్సీపీ నేత అభయ్ కైలాస్ రావ్ చిక్టగోంకర్
గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ pic.twitter.com/UyCfO3BMRF
— Sarita Avula (@SaritaTNews) March 29, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)