తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మంగళవారం ప్రగతి భవన్‌లో సమావేశయ్యారు.ఈ భేటీలో దేశంలోని ప్రస్తుత రాజకీయాలతోపాటు పంజాబ్ రాష్ట్ర పరిస్థితులపై ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించినట్లు తెలుస్తుంది. కేసీఆర్‌తో భేటీ ముగియడంతో ప్రగతి భవన్ నుంచి పంజాబ్ సీఎం బయలు దేరారు.
కాగా తాజ్ కృష్ణలో ఓ ఇన్‌వెస్ట్‌మెంట్ మీటింగ్‌లో పాల్గొనడానికి భగవంత్ మాన్ హైదరాబాద్ విచ్చేసిన సంగతి తెలిసిందే. ఇక పంజాబ్ శాసనసభ స్పీకర్ సర్దార్ కుల్తార్‌సింగ్ సంధ్వాన్ ఈ నెల 24న తెలంగాణకు రానున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ స్పీకర్ జైకిషన్ సింగ్ రౌరీ, రాజ్యసభ సభ్యుడు విక్రమ్‌జీత్ సింగ్ సాహ్ని, ఎమ్మెల్యే కుల్వంత్ సింగ్ పండోరి, మరో ఇద్దరు కూడా హైదరాబాద్‌కు రానున్నారు.
Here's CMO TS Tweet
Punjab Chief Minister Sri @BhagwantMann met Chief Minister Sri K. Chandrashekar Rao at Pragathi Bhavan today. The two leaders discussed current national issues. pic.twitter.com/xTWZ7b0FU8
— Telangana CMO (@TelanganaCMO) December 20, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)