కొద్ది రోజుల క్రితం షూటింగ్‌లో హీరోయిన్ రష్మిక మందన్నా గాయపడిన సంగతి తెలిసిందే. జిమ్‌లో కసరత్తు చేస్తుండగా ప్రమాదం జరగడంతో ఆమె కాలికి గాయమైంది. అయితే తాజాగా హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రత్యక్షమయ్యారు రష్మిక.

వీల్‌ ఛైర్‌లో వెళ్తున్న రష్మికా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం విక్కీ కౌశల్ హీరోగా తెరకెక్కుతున్న ఛావా సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది రష్మిక. ఈ సినిమా ప్రమోషన్ కోసం ముంబై వెళ్తున్నట్లు తెలుస్తోంది. రీసెంట్‌గా పుష్ప 2తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టారు రష్మికా. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు పూజలు చేస్తున్నారు.   దర్శకుడు సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు... పుష్ప 2 వసూళ్లకు తగ్గట్టుగా ట్యాక్స్ చెల్లింపులు జరగలేదన్న ఆరోపణల నేపథ్యంలో విస్తృత సోదాలు

Rashmika Mandanna arrives Mumbai in wheel chair..

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)