Hyd, Feb 9:  పారిశ్రామికవేత్త చంద్రశేఖర్ జనార్ధన్ హత్యకేసులో(Industrialist Chandrasekhar Murder Case) సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికాలో ఉండి ఇటీవలే హైదరాబాద్ వచ్చారు చంద్రశేఖర్ మనవడు కీర్తి తేజ(Keerthy Teja). తాత చంద్రశేఖర్‌ని చంపుతుంటే అడ్డు వచ్చిన తల్లిపై కూడా కీర్తి తేజ దాడి చేసినట్లు సమాచారం .

తల్లి, తాత అరుపులు విని ఇంట్లోకి వచ్చారు స్థానికులు. అప్పటికే చంద్రశేఖర్ చనిపోగా(Chandrasekhar Murder Case).. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్నారు కీర్తి తేజ తల్లి. వెంటనే తల్లిని ఆస్పత్రికి తరలించారు పోలీసులు. తాతను చంపి తల్లిని గాయాలపాలు చేసి ఏలూరు పారిపోయాడు కీర్తి తేజ. ఏలూరులో కీర్తి తేజను అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రముఖ వెల్జాన్ కంపెనీకి ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు చంద్రశేఖర్.

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై యువకుల కార్ రేసింగ్.. స్టంట్‌లతో హంగామా చేసిన యువకులు, వీడియో ఇదిగో

సొంత మనవడే ఆస్తి కోసం ఇంతటి దారుణానికి పాల్పడ్డాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. చంద్రశేఖర్‌ని 73 సార్లు కత్తితో పొడిచి చంపినట్లు గుర్తించారు. మిగతా మనవల్ని చూసినట్టు తనను చూడలేదని కసితో హత్య చేశాడు.

ఇటీవల కంపెనీలో ఒక మనవడికి డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారు చంద్రశేఖర్. కీర్తి తేజ చెడు వ్యసనాలను చూసి డైరెక్టర్ పోస్టు ఇవ్వలేదు. దీంతో తనకు డైరెక్టర్ పోస్ట్ ఇవ్వలేదనే కసితోనే కీర్తి తేజ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హైదరాబాద్ పంజాగుట్టలో ఈ ఘటన చోటు చేసుకుంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)