South Central Railway: రైల్వే ప్రయాణికులకు అలర్ట్, రెండు రోజుల పాటు పలు ఎంఎంటీఎస్, ప్యాసింజర్ రైళ్లు రద్దు, రద్దయిన రైళ్ల వివరాలు ఓ సారి చెక్ చేసుకోండి
హైదరాబాద్ నగరంలో పలు ఎంఎంటీఎస్‌లు, దూర ప్రాంతాలకు మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లు తాత్కాలికంగా రద్దు అయ్యాయి. మరమ్మతుల పనుల కారణంగానే దక్షిణ మధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. నేడు(బుధవారం),రేపు(గురువారం) నడిచే ప్యాసింజర్ రైళ్లు కూడా దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది.
హైదరాబాద్ నగరంలో పలు ఎంఎంటీఎస్‌లు, దూర ప్రాంతాలకు మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లు తాత్కాలికంగా రద్దు అయ్యాయి. మరమ్మతుల పనుల కారణంగానే దక్షిణ మధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. నేడు(బుధవారం),రేపు(గురువారం) నడిచే ప్యాసింజర్ రైళ్లు కూడా దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ప్యాసింజర్ రైళ్లలో.. విజయవాడ-భద్రాచలం రోడ్, భద్రాచలం రోడ్-విజయవాడ, సికింద్రాబాద్-వరంగల్, వరంగల్-సికింద్రాబాద్ సర్వీసులు ఉన్నాయి. అలాగే.. ఎంఎంటీఎస్ రైళ్ల వివరాలకొస్తే..
లింగంపల్లి-హైదరాబాద్,
హైదరాబాద్-లింగంపల్లి,
ఫలక్‌నుమా-లింగంపల్లి
లింగంపల్లి-ఫలక్‌నుమా
ఆర్సీ పురం-ఫలక్‌నుమా
ఫలక్‌నుమా-ఆర్సీ పురం
ఫలక్‌నుమా-హైదరాబాద్‌ల మధ్య ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
Here's South Central Railway Tweet
Cancellation of Passenger and MMTS Trains pic.twitter.com/RuX3ewtDG2
— South Central Railway (@SCRailwayIndia) January 11, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 11, 2023 03:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

