తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స‌మావేశాలు నిర‌వ‌ధిక వాయిదా ప‌డ్డాయి. ఈ నెల 9వ తేదీన అసెంబ్లీ ప్రారంభ‌మైంది. మొత్తం ఆరు రోజుల పాటు శాస‌న‌స‌భ స‌మావేశాలు కొన‌సాగాయి. ఈ ఆరు రోజుల్లో 26 గంట‌ల 33 నిమిషాల పాటు స‌మావేశాలు కొనసాగిన‌ట్లు స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ తెలిపారు. 19 మంది ఎమ్మెల్యేలు ప్ర‌సంగించారు. ఈ స‌భ‌లో రెండు అంశాల‌పై స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ‌లు జ‌రిగాయి. డిసెంబ‌ర్ 21వ తేదీన నాటికి స‌భ‌లో కాంగ్రెస్‌కు 64, బీఆర్ఎస్‌కు 39, బీజేపీకి 8, ఎంఐఎం 7, సీపీఐ త‌ర‌పున ఒక ఎమ్మెల్యే ఉన్న‌ట్లు స్పీక‌ర్ ప్ర‌క‌టించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత నిర్వ‌హించిన తొలి శాస‌న‌స‌భ స‌మావేశం ఇది.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)