తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎంఐఎం పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్‌లోని 9 స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ చీఫ్‌ అసదుద్దీన్‌ ఓవైసీ శుక్రవారం వెల్లడించారు. ఏడుగురు సిట్టింగ్‌లతో పాటు మరో రెండు స్థానాల్లో ఎంఐఎం పోటీ చేయనున్నట్లు తెలిపారు. చాంద్రాయణగుట్ట, చార్మినార్, యాకుత్ పురా, బహుదూర్‌పురా, నాంపల్లి, కార్వాన్, మలక్ పేట, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్‌లో పోటీ చేయనున్నట్టుగా ఓవైసీ పేర్కొన్నారు.

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలు అభ్యర్థుల ఎంపికను పూర్తి చేశాయి. బీఆర్‌ఎస్‌ దాదాపు అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా..బీజేపీ ఇప్పటి వరకు 88 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది.కాంగ్రెస్‌ సైతం రెండు విడదతల్లోనూ 100 స్థానాల్లో ప్రకటించింది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)