ఎమ్మెల్యే రాజయ్య.. పార్టీ మార్పు విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారడమా? లేదా? అనేది కాలమే నిర్ణయిస్తుందని అన్నారు. అయితే ఇప్పటికీ కేసీఆర్‌‌పై నమ్మకం ఉందని, టికెట్ తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా సీఎం కేసీఆర్.. స్టేషన్‌ ఘన్‌పూర్ నియోజకవర్గం టికెట్ ను కడియం శ్రీహరికి కేటాయించిన సంగతి విదితమే.

తనకు టికెట్ రాకున్నా మాదిగ జాతి తనతోనే ఉందని చెప్పారు. తన రాజకీయ జీవితం ఎమ్మార్పీఎస్ నుంచి మొదలైందని అన్నారు. తాను ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారి మాదిగ జాతి ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో మాదిగల పాత్ర కీలకమని చెప్పారు. మాదిగల అస్థిత్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కేసీఆర్‌‌ది అని అన్నారు. ఎమ్మెల్సీ, ఎంపీ సీట్లు ఇస్తామని అంటున్నారని, కానీ తాను ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉండాలని అనుకుంటున్నానని రాజయ్య తెలిపారు. ఒకవేళ టికెట్ రాకుంటే ఏం చేయాలనేది కాలమే నిర్ణయిస్తుందని అన్నారు.

Rajaiah Vs Kadiam Srihari

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)