పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు BJP భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, కోనేరు సత్యనారాయణ (చిన్ని)ను బీజేపీ పార్టీ సస్పెండ్ చేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ప్రకటనలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ (చిన్ని పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘించి, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు బీజేపీ నుండి సస్పెండ్ చేయడమైంది. ఈ సస్పెన్సన్ తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది.
ఇదిలా ఉంటే , మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు తనయుడు కోనేరు సత్యనారాయణ (Koneru Satyanarayana) అధికార బీఆర్‌ఎస్ (BRS) పార్టీలో చేరనున్నారు.సోమవారం రాత్రి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను (CM KCR) సత్యనారాయణ (చిన్ని) కలిశారు. ఈ సందర్భంగా కొనేరు చిన్నిని బీఆర్‌ఎస్‌లోకి పార్టీ అధినేత ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి చిన్న నేడు రాజీనామా చేయనున్నారు. అనంతరం కారెక్కనున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)