శుక్రవారం కాంగ్రెస్ (Congress) పార్టీ 45 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన 15 మందికి టికెట్లను కేటాయించింది. ఈ జాబితా పార్టీలో చిచ్చుపెట్టింది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు పార్టీ హైకమాండ్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గత ఏడాది మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి రాజీనామా చేయడంతో.. ఆయన స్థానంలో పాల్వాయి స్రవంతి పోటీ చేసి ఓడిపోయారు.ఆ ఉప ఎన్నికల్లో ఆమె మూడో స్థానంలో నిలిచారు.

అదే స్థానం నుచి చలమల కృష్ణారెడ్డి కూడా టికెట్ ఆశించారు. రాజగోపాల్ రెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయిన తర్వాత.. మునుగోడులో కాంగ్రెస్ జెండా కింద పడకుండా కాపాడుకుంటూ వచ్చానని ఆయన చెబుతున్నారు. కానీ వీరిద్దరి కాదని.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్.ఈ నేపథ్యంలో గత ఏడాది మునుగోడు ఉపఎన్నికల్లో స్రవంతికి రేవంత్ ఇచ్చిన వాగ్ధానం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 15 స్థానాలు కేటాయిస్తామని.. అందులో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇస్తామని ప్రచార సభ వేదికగా హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి.

పాల్వాయి స్రవంతికి మంత్రి పదవి ఇస్తామని ప్రకటించారు. ఆమెను గెలిపిస్తే.. మునుగోడు అభివృద్ధిలో దూసకెళ్తుందని చెప్పారు. అప్పుడు అంత మాటిచ్చిన రేవంత్ రెడ్డి..ఇప్పుడు కనీసం టికెట్ కూడా ఇవ్వకుండా.. పాల్వాయి స్రవంతిని మోసం చేశారని ఆమె అనుచరులు విమర్శిస్తున్నారు. రేవంత్ రెడ్డి పాత వీడియోను వైరల్ చేస్తున్నారు.

Palvai Sravanti and Revanth Reddy (photo-Video Grab)

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)