తెలంగాణ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల పోలింగ్ రాష్ట్రవ్యాప్తంగా జోరుగా కొనసాగుతోంది. కొన్ని చోట్ల ఈవీఎంల మొరాయింపు మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఉదయాన్నే పోలింగ్ బూత్‌లకు చేరుకుని తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ప్రముఖ సినీ నటులు సూపర్ స్టార్ మహేష్ (Mahesh Babu), అల్లు అర్జున్, రాంచరణ్ ఇంకా పలువురు సెలబ్రిటీలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణలో (Telangana) ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు సుమారు 51.89 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అత్యధికంగా మెదక్ జిల్లాలో 69. 33 శాతం, అత్యల్పంగా హైదరాబాద్ లో 31.17 శాతం పోలింగ్ నమోదైంది. ఓటు హక్కును వినియోగించుకున్న AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, వీడియో ఇదిగో..

Superstar Mahesh Casts Vote in Hyderabad with his Wife, Shows Indelible Ink Mark on His Finger

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)