ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పోటీ, పొత్తులపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీడీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఇక్కడ పొత్తులపై చర్చించేందుకు సమయం మించిపోయిందని చెప్పారు. తెలంగాణలో ఎన్ని స్థానాల్లో, ఏయే స్థానాల్లో పోటీ చేయాలనే విషయాన్ని కమిటీ నిర్ణయిస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అవసరాలను బట్టి పొత్తులు ఉంటాయని చెప్పారు. మరోవైపు ఏపీలో టీడీపీ, జనసేనలు కలిసి పోటీ చేసే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ కూటమిలో బీజేపీ కూడా ఉంటుందనే ప్రచారం జరుగుతున్నప్పటికీ... ఆ పార్టీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)