తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (TS Assembly Elections ) పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగనుంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 గంటల వరకు సుమారుగా 20.64 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు ఆదిలాబాద్‌లో అత్యధికంగా 30.65 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 30.64 శాతం పోలింగ్ నమోదు కాగా.. అత్యల్పంగా హైదరాబాద్ జిల్లాలో 12.39 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.
Here's Video
#WATCH | Telangana Elections | A senior citizen being helped to arrive at a polling booth, in a wheelchair, in Jubilee Hills.
The state is voting for the Assembly elections today. pic.twitter.com/KsrFJLjmCb
— ANI (@ANI) November 30, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)