Hyd, Dec 30: తెలంగాణ ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది.మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానాన్ని శాసన సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. సభ్యులంతా మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ స్మారక దినాలు వదిలేసి రాహుల్ గాంధీ న్యూ ఇయర్ వేడుకలకు వియత్నాం వెళ్లాడని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు. దేశానికి మన్మోహన్‌ చేసిన సేవలను ప్రజలు ఎన్నటికీ మరిచిపోరని తెలిపారు. పీవీకి దక్కనటువంటి గౌరవం.. మన్మోహన్‌కు దక్కిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యలకు అభ్యంతరం తెలిపారు మంత్రి శ్రీధర్‌బాబు.దీంతో మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణలో మన్మోహన్‌ సింగ్ విగ్రహం ఏర్పాటు, అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, కేంద్రం భారతరత్న ఇవ్వాలని డిమాండ్

ఇక మన్మోహన్ సింగ్ స్మారక దినాలు వదిలేసి రాహుల్ గాంధీ న్యూ ఇయర్ వేడుకలకు వియత్నాం వెళ్ళాడని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు స్పందించారు. కేటీఆర్ లాగా చక్కగా శాసన సభ సంప్రదాయాలకు అనుగుణంగా నివాళి అర్పించాలి కానీ రాజకీయాలకు దీన్ని వేదిక చేయకూడదు. ఈ సభాలో మన్మోహన్ సింగ్ గారికి మన గౌరవాన్ని చాటాలి.. అంతే కానీ వేరే అంశాల జోలికి మనం వెళ్తే ఆయనకు గౌరవం అందించదని కూనంనేని సాంబశివ రావు తెలిపారు.

Telangana Assembly Session 2024 Updates:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)