తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Telangana Assembly Sessions 2024) హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావుల మధ్య సోమవారం అసెంబ్లీలో నీటి ప్రాజెక్టులపై మాటల యుద్ధం (CM Revanth Reddy vs Harish Rao) జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ల కోసమని, అలాంటి చర్చ సందర్భంగా అపొజిషన్ పార్టీ లీడర్ కేసీఆర్ సభలో లేకుండా ఫామ్ హౌస్‌లో పడుకున్నారని, కరీంనగర్ ప్రజలు తరిమితే మహబూబ్ నగర్ వచ్చారని ఏద్దేవా చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యాలపై హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడటం దయ్యాలు వేదాలు వళ్ళించడం అవుతుందన్నారు. కోడంగల్ ప్రజలు తరిమితే మల్కాజ్‌గిరి వచ్చారంటు రివర్స్ కౌంటర్ ఇచ్చారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)