తెలంగాణ శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా తేలింది. రెగ్యులర్ మెడికల్ టెస్ట్‌లలో భాగంగా బుధవారం రాత్రి చేయించిన కోవిడ్‌ పరీక్షల్లో స్పీకర్‌కు పాజిటివ్ నమోదు అయింది. దీంతో ఆయన గురువారం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. కాగా ఇటీవల పోచారం తన మనవరాలి పెళ్లిలో పలువురు రాజకీయ ప్రముఖులను కలిశారు.

అయితే గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, తగు జాగ్రత్తలతో హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండాలని కోరారు. కాగా శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మనవరాలి పెళ్లి హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్‌తోపాటు ప్రముఖ రాజకీయ నాయకులందరూ హాజరయ్యారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)