న‌ల్ల‌గొండ జిల్లాలోని ముషంప‌ల్లి గ్రామానికి చెందిన మ‌ల్ల‌య్య అనే రైతు.. కాంగ్రెస్ పార్టీని అన‌వ‌స‌రంగా గెలిపించామంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేసీఆర్ పాల‌నలో సాగునీరు వ‌చ్చింది. 24 గంట‌ల నాణ్య‌మైన క‌రెంట్ అందింది. ఏడాదికి రెండుసార్లు రైతుబంధు జ‌మ చేసి అప్పుల పాలు కాకుండా చేశారు. కానీ రేవంత్ పాల‌న‌లో రైతుబంధు రాక అప్పుల‌పాల‌వుతున్నామ‌ని, మ‌ళ్లీ కేసీఆరే రావాలి.. నాతో పాటు మ‌రో ప‌ది మందితో కేసీఆర్‌కు ఓట్లు వేయిస్తామ‌ని రైతు మ‌ల్ల‌య్య ఆవేద‌న‌తో మాట్లాడారు.

యాదాద్రిలో దారుణం, ఐదేళ్ల కొడుకుకు ఉరి వేసి చంపి సూసైడ్ చేసుకున్న తల్లి, అనారోగ్య పరిస్థితులే కారణం

రైతు మ‌ల్ల‌య్య మాట్లాడిన వీడియోను జ‌ర్న‌లిస్టు గౌత‌మ్ గౌడ్ యూట్యూబ్‌లో పోస్టు చేశారు. కాంగ్రెస్ పాల‌న‌తో అన్న‌దాత‌ల ప‌రిస్థితి ఇది అని వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు. అయితే ఈ వీడియోను పోస్టు చేసిన జ‌ర్న‌లిస్టు గౌత‌మ్ గౌడ్ కేసు న‌మోదు చేశారు పోలీసులు. ఈ ఘ‌ట‌న‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. అస‌లు ఈ వీడియోలో త‌ప్పేముంది..? జ‌ర్న‌లిస్టు గౌత‌మ్ గౌడ్‌పై కేసు ఎందుకు న‌మోదు చేశారు..? అని తెలంగాణ డీజీపీని కేటీఆర్ ప్ర‌శ్నించారు. నేను కూడా ముషంప‌ల్లిలో రైతు మ‌ల్ల‌య్య‌ను క‌లిశాను. అత‌నితో మాట్లాడాను. మ‌రి నాపై కేసు పెడుతారా..? అని డీజీపీని కేటీఆర్ సూటిగా ప్ర‌శ్నించారు.

Here's Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)