తెలంగాణ ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఎంసెట్‌ (TS EAMCET) పేరును టీఎస్‌ ఈఏపీసెట్‌ (TS EAPCET)గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.దీంతో పాటుగా ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేస్తూ షెడ్యూల్‌ విడుదల చేసింది. ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ (TS EAPCET) సహా మరో ఆరు కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్టుల తేదీలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

2024- 25 ప్రవేశ పరీక్షల తేదీలు

తెలంగాణ ఈసెట్‌ - మే 6 - ఉస్మానియా యూనివర్సిటీ

టీఎస్‌ ఈఏపీసెట్‌ (ఇంజినీరింగ్‌)- మే 9 నుంచి 11 వరకు; (అగ్రికల్చరల్‌ అండ్‌ ఫార్మా) మే 12, 13 - జేఎన్‌టీయూహెచ్‌

టీఎస్‌ ఎడ్‌సెట్‌ - మే 23 - మహాత్మాగాంధీ యూనివర్సిటీ

టీఎస్‌ లా సెట్‌; పీజీఎల్‌సెట్‌ - జూన్‌ 3 - ఉస్మానియా యూనివర్సిటీ

టీఎస్‌ ఐసెట్‌ - జూన్‌ 4, 5 - కాకతీయ యూనివర్సిటీ

టీఎస్‌ పీజీఈసెట్‌ జూన్‌ 6 నుంచి 8వరకు - జేఎన్‌టీయూహెచ్‌

టీఎస్‌ పీఈసెట్‌ - జూన్‌ 10 నుంచి 13 వరకు - శాతవాహన యూనివర్సిటీ

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)