నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నుమాయిష్ సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం, శ్రీధర్‌బాబు(నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు కూడా) పాల్గొన్నారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకు నుమాయిష్ 2024 జరగనుంది. నుమాయిష్ కోసం ఈసారి 2,400 స్టాల్స్ ఏర్పాటు చేశారు. నుమాయిష్ నేపథ్యంలో నగరంలో 45 రోజుల పాటు ఆ రూట్‌లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు.
నుమాయిష్ టికెట్ ధర రూ.40గా నిర్ణయించారు. నుమాయిష్ సాధారణ రోజులలో సాయంత్రం 4 నుంచి రాత్రి 10.30 వరకు కొనసాగుతోంది. వీకెండ్స్,సెలవు దినాల్లో మాత్రం సాయంత్రం 4 నుండి రాత్రి 11 గంటల వరకు నుమాయిష్ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది.కాగా మాస్కులు కచ్చితంగా ధరించి రావాలంటూ సందర్శకులను కోరుతున్నారు నిర్వాహకులు.
Here's Video and News
CM Revanth Reddy, inaugurated Numaish at the Nampally exhibition ground on Monday
Numaish is open for visitors from 4 pm to 10:30 pm on weekdays and 4:00 pm to 11:00 pm on weekends
The entrance ticket costs Rs 40 pic.twitter.com/6b5raajubO
— The Siasat Daily (@TheSiasatDaily) January 1, 2024
♦️హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్లో మైదానంలో నుమాయిష్ ప్రారంభం అయింది.
♦️సీఎం @revanth_anumula , మంత్రులు @OffDSB , @PonnamLoksabha లు నుమాయిష్‌ను ప్రారంభించారు. pic.twitter.com/tNWMESQyTb
— DD News Telangana | తెలంగాణ న్యూస్ (@ddyadagirinews) January 1, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)