రష్యా-ఉక్రెయిన్  యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌ నుంచి అర్ధాంతరంగా తిరిగివచ్చిన వైద్య విద్యార్థులకు ఇక్కడి మెడికల్‌ కాలేజీల్లో అడ్మిషన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం లేఖ రాశారు. చదువు మధ్యలోనే ఆగిపోయి విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ఈ విషయంపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ విద్యార్థులను స్పెషల్‌ కేసుగా పరిగణించి మన దేశంలోని వైద్య కళాశాలల్లో సీట్లు సర్దుబాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ విద్యార్థులను రాష్ట్రప్రభుత్వమే పూర్తి ఫీజులు చెల్లించి చదివిస్తుందని తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)