ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ‘గోల్డ్ పతకం సాధించిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్‌కు సీఎం కేసీఆర్ (CM KCR) భారీ నజరానా ప్రకటించారు. ఆమెతోపాటు ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ పోటీల్లో స్వర్ణం సాధించిన మరో తెలంగాణ తేజం ఇషా సింగ్‌కు కూడా భారీ నజరానా ఇస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్‌గా చరిత్ర సృష్టించిన నిఖత్ జరీన్, షూటింగ్ ఛాంపియన్‌గా నిలిచిన ఇషా సింగ్ ఇద్దరికీ చోరో రూ.2 కోట్లు నగదు బహుమతి ఇస్తున్నట్లు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. నగదుతోపాటు ఇద్దరికీ ఇంటి స్థలాలు కూడా కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూబ్లీహిల్స్ లేదా, బంజారాహిల్స్‌లో ఈ స్థలం కేటాయించనున్నట్లు ప్రకటించింది.
అలాగే సీఎం శ్రీ కేసీఆర్ ప్రకటించిన విధంగా పద్మశ్రీ కిన్నెరమెట్ల మొగిలయ్యకు కోటి రూపాయల నగదు పురస్కారాన్ని మంజూరుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గతంలో పద్మశ్రీ మొగిలయ్య కోరుకున్నట్టుగా బిఎన్.రెడ్డి నగర్ లో నివాసయోగ్యమైన ఇంటిస్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నగదు బహుమతితో పాటు వీరికి బంజారాహిల్స్ లేదా జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో నివాసయోగ్యమైన ఇంటిస్థలాన్ని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది
— Telangana CMO (@TelanganaCMO) June 1, 2022
సీఎం శ్రీ కేసీఆర్ ప్రకటించిన విధంగా పద్మశ్రీ కిన్నెరమెట్ల మొగిలయ్యకు కోటి రూపాయల నగదు పురస్కారాన్ని మంజూరుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గతంలో పద్మశ్రీ మొగిలయ్య కోరుకున్నట్టుగా బిఎన్.రెడ్డి నగర్ లో నివాసయోగ్యమైన ఇంటిస్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది
— Telangana CMO (@TelanganaCMO) June 1, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)