ఎంబీసీ సిద్ధాంత కర్త, సామాజిక అభ్యుదయవాది కోలపూడి ప్రసాద్‌ (కోప్ర) మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు. తను నమ్మిన విలువల కోసం అహర్నిశలు పాటుపడిన కోప్ర మరణంతో అత్యంత వెనుకబడిన వర్గాలు తమలో ఒక గొప్ప మేధావిని కోల్పోయినట్టయ్యిందని విచారం వ్యక్తం చేశారు. కోప్ర కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. నెల్లూరు జిల్లాకు చెందిన కోల‌పూడి ప్ర‌సాద్ గ‌త కొంత‌కాలం నుంచి అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. హైద‌రాబాద్‌లోని ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం క‌న్నుమూశారు. మెద‌డు ర‌క్త నాళాల్లో ర‌క్తం గ‌డ్డి చ‌నిపోయిన‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు. కోప్రాకు భార్య నిర్మ‌ల‌, ఒక పాప ఉన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)