తెలంగాణ సీఎం కేసీఆర్ కాసేప‌టి క్రితం య‌శోద‌ ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నేటి ఉద‌యం కాస్త న‌ల‌త‌గా అనిపించ‌డంతో ఆయ‌న‌ను కుటుంబ స‌భ్యులు య‌శోద ఆసుప‌త్రికి త‌ర‌లించిన సంగ‌తి తెలిసిందే. ఎడ‌మ చేయితో పాటు కాలు కూడా లాగుతున్న‌ట్లుగా ఉంద‌ని కేసీఆర్ చెప్ప‌డంతో ఆయ‌న‌కు గుండె సంబంధిత వ్యాధులేమైనా ఉన్నాయా? అన్న‌ కోణంలో య‌శోద ఆసుప‌త్రి వైద్యులు ప‌లు వైద్య ప‌రీక్ష‌లు చేశారు. యాంజియోగ్రామ్‌తో పాటుగా సిటీ స్కాన్‌, ఈసీజీ త‌దిత‌ర ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించారు. ప‌రీక్ష‌ల అనంత‌రం కేసీఆర్‌కు ఎలాంటి గుండె సంబంధిత స‌మ‌స్య‌లు లేవ‌ని య‌శోద ఆసుప‌త్రి వైద్యులు తెలిపారు. అంతేకాకుండా ఆయ‌న‌ను ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ కూడా చేశారు. ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్ నేరుగా ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు వెళ్లారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)