తెలంగాణ సీం కేసీఆర్ క్యాంప్ ఆఫీసు ప్రగతి భవన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. 73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్వర రావు, డీజీపీ మహేందర్ రెడ్డి, సీఎంవో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అంతకు ముందు సైనిక అమర వీరులకు సీఎం కేసీఆర్ నివాళి అర్పించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఉన్న అమర వీరుల స్థూపం వద్దకు చేరుకున్న సీఎంకు త్రివిధ దళాలు స్వాగతం పలికాయి. అనంతరం యుద్ధ వీరులకు అమర వీరుల స్థూపం వద్ద పుష్ప గుచ్చం ఉంచి నివాళి అర్పించారు.
73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు పరేడ్ గ్రౌండ్ లో అమర జవానుల స్మారక స్థూపం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి అమర జవాన్లకు ఘన నివాళులు అర్పించారు.#గణతంత్రదినోత్సవం#RepublicDayIndia pic.twitter.com/MoRcfrULhd
— Telangana CMO (@TelanganaCMO) January 26, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)