రంగారెడ్డి జిల్లా కొండకల్ వద్ద నిర్మించిన మేథా గ్రూప్ రైల్వేకోచ్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురువారం ప్రారంభించారు. దేశంలోనే పెద్ద రైల్వేకోచ్ ఫ్యాక్టరీని రూ.1000కోట్లతో మేధా గ్రూప్ నిర్మించింది. ఫ్యాక్టరీతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2200 మందికి ఉపాధి లభించనున్నది. రైల్ కోచ్‌ల తయారీ, ఎగుమతులకు కేంద్రంగా నిలువనున్నది.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా టీఎస్ ఐపాస్‌ను తీసుకువచ్చామని సీఎం కేసీఆర్ అన్నారు.మేథా ఫ్యామిలీ మెంబర్స్‌కు శుభాకాంక్షలు. రైల్వే మ్యానుఫ్యాక్చర్ చేస్తారంటే ఊహించలేదు. విడివిడి భాగాలను ఎంత స్కిల్‌తో చేస్తున్నారో కశ్యప్‌రెడ్డి స్వయంగా చూపించారు.తెలంగాణ బిడ్డలే ఈ రోజు దేశానికి, ప్రపంచానికి అవసరమైన రైళ్లు తయారుచేసే అద్భుతమైన ప్రాజెక్టును, రూ.2500కోట్ల పెట్టుబడితో ఫేజ్-1ను పూర్తి చేసి, మ్యానుఫ్యాక్చరింగ్ పూర్తి చేసి ఈ రోజు నాతో ప్రారంభింపజేసుకున్నారు. కశ్యప్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మేథా కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలని తెలిపారు.
Railway Coach Factory Inauguration
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)