దేశంలో నెలకొన్న రాజకీయ శూన్యతను పూరించేందుకు జాతీయస్థాయిలో కీలకపాత్ర పోషించాల్సిందేనని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు(CM K Chandrashekar Rao) కృత నిశ్చయంతో ఉన్నారని.. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా బీజేపీయేతర, కాంగ్రెసేతర పక్షాలతో సంబంధాలను కొనసాగించాలని నిర్ణయించారని తెలిసింది. ఇందుకు అనుగుణంగా రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని త్వరలోనే ఖరారు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.
ఈ నెల 10న జరిగిన పార్టీ ముఖ్యనేతల సమావేశంలో వెల్లడైన అభిప్రాయాలకు అనుగుణంగా.. జాతీయ స్థాయిలో రాజకీయ అరంగేట్రంపై సరైన సమయంలో, సరైన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు ఆదివారం ప్రగతిభవన్‌లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో భేటీ అయిన సీఎం కేసీఆర్.. జాతీయ పార్టీ ప్రకటన, రాష్ట్రపతిఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, రాబోయే ఎన్నికలు, ఎమ్మెల్యేలు– ప్రభుత్వ పనితీరుపై పీకే బృందం చేసిన సర్వే నివేదికలపై చర్చించారు. ప్రగతిభవన్‌లో సుమారు నాలుగు గంటల పాటు జరిగిన ఈ భేటీలో కేసీఆర్, పీకేతోపాటు మంత్రి హరీశ్‌రావు కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ త్వరలో భారతీయ రాష్ట్ర సమితి పేరుతో జాతీయ పార్టీని ప్రారంభించి జాతీయ రాజకీయల్లో అడుగుపెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Telangana CM K Chandrashekar Rao set to enter national politics as he will be launching a national party named 'Bharatiya Rastra Samiti' this month: Sources
(File Pic) pic.twitter.com/IrhGJHZmVl
— ANI (@ANI) June 12, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)