యాదాద్రి ఆల‌యంలో శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామిని సీఎం కేసీఆర్, ఆయ‌న స‌తీమ‌ణి శోభ ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా స్వామి వారికి కేసీఆర్ దంప‌తులు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆల‌య దివ్య విమాన గోపుర‌మున‌కు బంగారు తాపడం కోసం.. కేజీ 16 తులాల బంగారాన్ని విరాళంగా అందించారు. ఈ విరాళాన్ని కేసీఆర్ మ‌నుమ‌డు హిమాన్షు అందించారు. పూజ‌ల అనంత‌రం కేసీఆర్ కుటుంబ స‌భ్యుల‌ను ఆశీర్వ‌దించి, తీర్థ ప్ర‌సాదాల‌ను అంద‌జేశారు. కుటుంబ స‌మేతంగా ద‌ర్శ‌నానికి వ‌చ్చిన కేసీఆర్‌కు ఆల‌య అర్చ‌కులు పూర్ణ‌కుంభంతో ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)