భారీ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్‌(స్విట్జర్లాండ్‌)లో పర్యటిస్తున్నారు. సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా ఆయన దావోస్‌కు వెళ్లిన సీఎం.. 19వ తేదీ వరకు వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) 54వ సమావేశంలో పాల్గొననున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సు నుంచి ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ ప్రచారాన్ని మొదలు పెట్టామని సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్‌ చేశారు.

వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్గ్ బ్రెండెతో సమావేశం జరిగిందన్నారు. ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలు కలసికట్టుగా పనిచేస్తే ప్రజలు సంపన్నులుగా మారతారని రేవంత్‌ అన్నారు. తెలంగాణ పారిశ్రామిక విధానంపై ఇథియోపియా ఉప ప్రధానితో చర్చ జరిగిందని, రాష్ట్రంలో స్కిల్ డెవలప్‌మెంట్‌ కోసం చేపట్టవలసిన కార్యక్రమాలపై నాస్కామ్ ప్రతినిధులతో చర్చలు జరిగాయని సీఎం రేవంత్‌ వివరించారు.

Here's Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)