తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.అయితే అధిష్ఠానం దాదాపు రేవంత్ రెడ్డి పేరును దాదాపు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నారు. ఆయన హైదరాబాద్ వచ్చాక రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేయనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లా వద్ద పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు... రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వారు హోటల్లోకి దూసుకువెళ్లే ప్రయత్నాలు చేశారు. అయితే పోలీసులు... కార్యకర్తలను నిలువరించి బయటకు పంపించారు. ఈ సమయంలో ఓ కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకోవడానికి ప్రయత్నించాడు. పోలీసులు అతనిని అడ్డుకున్నారు.
Here's News
Congress | ముఖ్యమంత్రి ఎంపికలో జాప్యం.. కట్టలు తెంచుకుంటున్న కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహం ఎల్లా హోటల్ వద్ద ఆత్మహత్యాయత్నం-Namasthe Telanganahttps://t.co/7oSEdvuGw9
— Namasthe Telangana (@ntdailyonline) December 5, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)