ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఆదిలాబాద్‌లో జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా కాలేశ్వరం ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ కుమ్మక్కవుతుంది. గతంలో మీరు తిన్నారు. ఇప్పుడు మేము తింటాం అన్నట్లు కాంగ్రెస్ పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చినా పాలనలో ఎలాంటి మార్పు లేదని మండిపడ్డారు.  ఆదిలాబాద్‌లో రూ.56 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంఖుస్థాపన, రాష్ట్ర అభివృద్ధికి పెద్దన్నలా సహకరించాలని కోరిన సీఎం రేవంత్ రెడ్డి

‘తెలంగాణలో టీఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత ఎలాంటి మార్పు రాలేదు. బీఆర్‌ఎస్‌ పోయి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా  ఏమీ మార్పు రాదు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్‌ కుంభకోణం చేస్తే ఆ స్కామ్‌ ఫైళ్లను కాంగ్రెస్‌ తొక్కి పట్టింది. మీరు తిన్నారు. మేమూ తింటాం అని కాంగ్రెస్‌ అంటోంది.  మోదీ గ్యారెంటీపై ప్రస్తుతం దేశంలో చర్చ జరుగుతోంది. మోదీ గ్యారెంటీ అంటే గ్యారెంటీగా పూర్తయ్యే గ్యారెంటీ అని అన్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)