జీవో నెంబర్ 46ను రద్దు చేయాలంటూ కానిస్టేబుల్ అభ్యర్థులు నూతన సెక్రటేరియట్‌ను ముట్టడించే ప్రయత్నం చేశారు.ఈ నేపథ్యంలో తెలంగాణ సచివాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కానిస్టేబుల్ అభ్యర్థులు బుధవారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా సచివాలయం గేటు వద్దకు దూసుకొచ్చారు. ఈ క్రమంలో సెక్రటేరియల్ గేటు ముందు బైఠాయించి జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
దీంతో, తక్షణమే అలర్ట్ అయిన పోలీసులకు, అభ్యర్థులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం.. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రిక్రూట్‌మెంట్‌ను పాత పద్దతితోనే చేపట్టాలని, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జీవో 46 వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
Here's Video
Constable aspirants laid a siege at #Telangana Secretariat to cancel GO46. They Demanded to take up selection as per the old rules and do justice to rural students. pic.twitter.com/7BQm425uyn
— Naveena (@TheNaveena) July 26, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)