దుబ్బాక BJP ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకున్న ఆయన..సిద్దిపేట జిల్లాకు వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా హకీంపేట ఎయిర్ పోర్స్ స్టేషన్ దగ్గర పోలీసులు రఘునందన్ రావును అరెస్ట్ చేసి..అల్వాల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. జులై 04వ తేదీ మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వెల్లో శివాజీ విగ్రహం దగ్గర ఘర్షణలు జరగడంతో ఎమ్మెల్యే అక్కడకు బయలుదేరారు. గజ్వెల్లోని బాధిత హిందూ యువకులను పరామర్శించడానికి వెళ్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు..ఆయన్ను అడ్డుకుని అరెస్ట్ చేశారు.
ANI Tweet
Telangana | Dubbaka MLA Raghunandan Rao has been taken into custody and kept at Alwal police station. It is a preventive arrest: Upender Rao, Inspector, Alwal police station
Rao was going to Gajwel where a man had allegedly urinated near a statue of Chhatrapati Shivaji Maharaj… pic.twitter.com/9n8WV8Fuyw
— ANI (@ANI) July 5, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)