తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ కమిటీలను ప్రకటించింది . స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని నియమిస్తూ గురువారం ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం మొత్తం 14 కమిటీల్ని ప్రకటించింది బీజేపీ. ఇందులో భాగంగా.. రాజగోపాల్‌రెడ్డికి కీలక బాధ్యతలు అప్పజెప్పింది.

పబ్లిక్‌ మీటింగ్‌ కమిటీ ఇంఛార్జ్‌గా బండి సంజయ్‌, మ్యానిఫెస్టో, పబ్లిసిటీ కమిటీలకు చైర్మన్ గా గడ్డం వివేక్‌ వెంకటస్వామి, ఛార్జ్‌షీట్‌ కమిటీ చైర్మన్‌గా మురళీధర్‌రావు ఎంపిక చేసింది. వీటితో పాటు..అజిటేషన్ కమిటీ(నిరసనలు, ఆందోళన నిర్వహణల బాధ్యతలు) చైర్మన్ గా విజయశాంతి, ప్రభావిత వ్యక్తులను కలిసే కమిటీ చైర్మన్ గా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎన్నికల కమిటీ చైర్మన్గా మర్రి శశిధర్ రెడ్డి, సోషల్ మీడియా కమిటీ చైర్మన్ గా ధర్మపురి అర్వింద్‌లకు బాధ్యతలు అప్పజెప్పింది. పొంగులేటి సుధాకర్‌, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎమ్మెల్సీలు రామచందర్‌రావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డిలు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలకు సైతం కమిటీలలో చోటు కల్పించారు.

BJP-Elections-Comitteess

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)