తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పోలీస్ అధికారిని దూషించారనే ఆరోపణల్లో భాగంగా ఎంఐఎం నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఓవైసీ(Akbaruddin Owaisi)పై సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఈ మేరకు ఓ వీడియో వైరల్‌ కావడం కూడా తెలిసిందే. ల‌లితాబాగ్‌లో మంగళవారం రాత్రి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న స‌మయంలో.. సమయం అయిపోతుందని, ప్ర‌చారం ముగించాల‌ని స్థానికంగా విధులు నిర్వ‌స్తున్న ఎస్సై శివచంద్ర అక్బరుద్దీన్‌ను కోరారు. ఆ స‌మ‌యంలో పోలీసు అధికారిపై అక్బ‌రుద్దీన్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఇంకా సమయం ఉందని, తాను మాట్లాడి తీరతానని, తనను ఆపేవాళ్లింకా పుట్టలేదని, తనను ఆపే దమ్ము ఎవరికీ లేదని, తన ఒంట్లో బుల్లెట్లు దిగినా.. కత్తిగాయాలు అయినా ధైర్యం ఇంకా మిగిలే ఉందని, ఒక్క సైగ చేస్తే ఇక్కడ ఉన్న అందరూ నిన్ను పరిగెత్తిస్తారంటూ ఎస్సైను ఉద్దేశించి అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో పాటు రాజకీయంగానూ విమర్శలకు తావిచ్చింది. మరోవైపు ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్‌ 353(విధుల్ని అడ్డుకోవ‌డం)తో పాటు మరికొన్ని సెక్ష‌న్ల కింద అక్బరుద్దీన్‌ ఒవైసీపై కేసు న‌మోదు చేసిన‌ట్లు డీసీపీ రోహిత్ రాజు వెల్లడించారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)